Share News

వేల్పుచర్లలో నాలుగు డెంగీ కేసులు

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:36 AM

మండలంలోని వేల్పుచర్లలో నాలుగు డెంగీ కేసులు వెలుగు చూశాయి. ఒకే ఇంటిలో జంగం దీక్షిత(9), జంగం గీతిక(7)లతోపాటు చల్లా అఖిల్‌, రామాల చందులు కొన్ని రోజు లుగా జర్వంతో బాధ పడుతున్నారు.

వేల్పుచర్లలో నాలుగు డెంగీ కేసులు

ముసునూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):మండలంలోని వేల్పుచర్లలో నాలుగు డెంగీ కేసులు వెలుగు చూశాయి. ఒకే ఇంటిలో జంగం దీక్షిత(9), జంగం గీతిక(7)లతోపాటు చల్లా అఖిల్‌, రామాల చందులు కొన్ని రోజు లుగా జర్వంతో బాధ పడుతున్నారు. వీరికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయగా డెంగీగా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిణి డాక్టర్‌ షకీనా ఇవాంజలి గురువారం తెలిపారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలోనే చికిత్స పొందున్నారని, వారి ఆర్యోగం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. గ్రామంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఇంటింటి ఫీవర్‌ సర్వేను చేపట్టారు. జర్వం లక్షణాలు ఉన్నవాళ్ళను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో పారుశుధ్యం అధ్వానంగా ఉందని, మురుగునీరు నిల్వలతో దోమలు పెరిగిపోయి, అనారోగ్యానికి గురి అవుతున్నామని స్థాని కులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు, పాలకులు, వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దోమల నివారణ మందును పిచికారీ చేయలేదని వారు అధికారులు, పాల కుల పనితీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 29 , 2025 | 12:36 AM