24న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:03 AM
ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువుతీరిన లక్ష్మీనారసింహుని ఆలయంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈనెల 24న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
సుందరగిరిపై అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ద్వారకాతిరుమల, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువుతీరిన లక్ష్మీనారసింహుని ఆలయంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈనెల 24న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఏర్పాట్లను, హెలీప్యాడ్‌కు అనువైన ప్రదేశాన్ని గురువారం జడ్పీ సీఈవో శ్రీహరి, ఎంపీడీవో పీవీవీ ప్రకాశ్, ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ జీటీవీ శ్రీనివాస్, తహసీల్దార్ జేవీ సుబ్బారావు, పోలీసులు పరిశీలించారు. పవన్ తన పర్యటనలో భాగంగా దేవాలయ అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన 30 ఎకరాల పత్రాలను అఽధికారులకు అందజేస్తారు. గ్రామంలో నిర్మించిన 130 మీటర్ల మ్యాజిక్ డ్రెయిన్‌ను, రూ.3.70 కోట్లతో కొండపైకి మంజూరైన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు.