Share News

22ఏ భూముల.. కథ తేలేనా!

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:39 AM

జిల్లాలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు పరిష్కార మార్గం యోచించే దిశగా యంత్రాంగం కసరత్తులను ఆరంభిం చింది. ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భూములను కొన్నేళ్లుగా 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడంపై పలువర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

22ఏ భూముల.. కథ తేలేనా!
ఏలూరులోని విజయగార్డెన్స్‌లో నిషేధిత జాబితాలో చేర్చిన స్థలాలు, ఇళ్లు

కలెక్టరేట్‌లో 16న మెగా గ్రీవెన్స్‌సెల్‌

ప్రజలు, ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి వినతుల స్వీకరణ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు పరిష్కార మార్గం యోచించే దిశగా యంత్రాంగం కసరత్తులను ఆరంభిం చింది. ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భూములను కొన్నేళ్లుగా 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడంపై పలువర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖలైన రెవె న్యూ, కలెక్టరేట్‌, రిజిస్ర్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. రిజిస్ర్టేషన్‌ అధికారులు రెవెన్యూ లేదా కలెక్టర్‌ నుంచి నిషేధంపై నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే రిజిస్ర్టేషన్‌ చేస్తామని చెబుతుండడంతో ఈ భూముల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందాన నిలిచిపోయాయి. కొంతమంది రాజకీయ నాయకులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై ప్రభుత్వ భూములు దక్కించుకునే ప్రయత్నా ల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని భూములను ప్రీహోల్డ్‌లో పెట్టింది. ఈ గడువును ఆర్నెళ్లకు పొడిగిస్తూ వస్తోంది. ప్రధానంగా అసైన్డ్‌ చేసిన, దేవాల య కౌలు భూముల్లోను ఈ సమస్యలు చోటు చేసుకున్నాయి. దీనిపై గత నెలలో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం (డీఆర్‌సీ)లో గంటపాటు చర్చకు దారితీసింది. అజెండాలో 22ఏ అంశంపైన చర్చించాలని ప్రభుత్వం నిర్ణ యించడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌, మరో మంత్రి కొలుసు పార్థసారథి దీనికి పరిష్కార మార్గాలను అన్వేషించాలని తీర్మానించారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న ఉదయం 10 గంటల నుంచి కల్టెరేట్‌లో 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, రిజిస్ర్టేషన్‌శాఖ జిల్లా అధికారులు ఆధ్వర్యంలో మెగా గ్రీవెన్స్‌ డేను చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించింది.

125 అర్జీలు పెండింగ్‌లోనే...

జిల్లాలో 22ఏ కింద నిషేధిత భూముల్లో చేర్చినవి 125 దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నా యి. ప్రధానంగా నూజివీడులోనే 40కు పైబడి ఈ రకంగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. భూములను నిషేధిత జాబితాల్లో చేర్చడం వెనుక రెవెన్యూ అధికారులు తప్పి దాలు కొంతవరకు కారణం. ఎండోమెంట్‌, ఇతర స్థలాలకు గతంలో ఆక్రమిత పట్టాలకు ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్లతో ఉన్నవి కూడా జాబితాలో చేర్చడానికి ఆస్కారం ఉంది. కొంత మంది డి ఫాం పట్టా భూములు అనుభవించ డానికి అవకాశం ఇస్తే అమ్మేసుకున్న బాపతు కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. ఇటీవల పీజీఆర్‌ఎస్‌, కమిషన ర్లు, రిజిస్ర్టేషన్ల శాఖ అధికారుల చుట్టూ ఈ తరహా భూములు విషయంపై ప్రజలు కాళ్లరిగేలా తిరుగుతుండడంతో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నారు. ప్రజలు అనుభవిస్తున్న భూములో డీసీసీబీ, ఇతర శాఖలు జప్తు చేసినవి ఉండటం చర్చనీయాంశమైంది.

ఒక్కరోజులో పరిష్కారం సాధ్యం కాదు

22ఏ భూముల పరిష్కారం ఒక్కరోజు గ్రీవెన్స్‌ నిర్వహణతో రాదని అధికారులు ఒక్క నిర్జయం వచ్చినట్టు సమాచారం. ప్రైవేట్‌ భూములను కబ్జా చేసిన వారు ఈ గ్రీవెన్స్‌కు ఎంత మంది వస్తారో? అంచనాకు రాలేకపోతున్నారు. మరోవైపు దీనికి పరిష్కారం మార్గం ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ దరఖాస్తుల పరిష్కారానికి యంత్రాంగం ఒక అడుగు ముందుకేయడంతో 22ఏ నిషేధిత భూముల్లో చేర్చడంతో వాస్తవంగా ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:39 AM