Share News

వరి కోతలకు వెళ్లి విద్యుత్‌ షాక్‌

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:36 AM

వరి కోతలకు వెళుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

వరి కోతలకు వెళ్లి విద్యుత్‌ షాక్‌

ఇరగవరం/గండేపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):వరి కోతలకు వెళుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇరగవరం మం డలం పేకేరుకు చెందిన కరిపెట్టి సింహాద్రి అప్పన్న(53) వరి కోత యంత్రాలతో ఆయా ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తు న్నాడు. అతని వద్ద కోత మిషన్‌ డ్రైవర్‌గా రాపాకకు చెందిన గెడ్డం సందీప్‌(20) పని చేస్తున్నాడు. కాకినాడ జిల్లా పరిసర ప్రాం తాల్లో వరి కోతలు కోసేందుకు ఐషర్‌ వ్యాన్‌పై కోత యంత్రం వేసుకుని బయలు దేరారు. ఆదివారం గండేపల్లి మండలం రామయ్యమ్మపాలెం వద్ద మిషన్‌కు 11 కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి డ్రైవర్‌ సందీప్‌ షాక్‌తో మృతి చెందాడు. ముందు బండిపై వెళుతున్న అప్పన్న వెనక్కి వచ్చి ఏమ యిందోనని వ్యాన్‌ను ముట్టుకోగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతదేహాలను అంబులెన్స్‌లో మార్చురీకి తరలించారు. సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ శివనా గబాబు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

సందీప్‌ తండ్రి లాజరు వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి ప్రేమలత ఉపాధి నిమి త్తం ఇతర దేశాలకు వెళ్లారు. సందీప్‌ పెద్ద అక్కకు వివాహం కాగా, రెండో అక్క డిగ్రీ చదువుతోంది. సందీప్‌ పదో తరగతి వరకు చదువుకుని డ్రైవర్‌గా చేరారు. సోదరుడి మృతితో అక్కలు గుండెలు పగిలేలా రోది స్తున్నారు. అప్పన్నకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు వీరాస్వామి, వెంకటర మణ ఉన్నారు. పెద్ద కుమారుడు ఇటీవల అమెరి కాకు వెళ్లేందుకు సిద్దపడుతుండగా చిన్న కుమారుడు వెంకటరమణ బెంగుళూ రులో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం ఉదయం వీరి మరణ వార్త వినగానే రాపాక, పేకేరు గ్రామాల్లో బంధువులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయాయి.

Updated Date - Nov 10 , 2025 | 01:36 AM