Share News

1,734 విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణ

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:05 AM

గృహ విద్యుత్‌ వినియోగంలో అధిక లోడు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.

1,734 విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణ

భీమవరం టౌన్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి):గృహ విద్యుత్‌ వినియోగంలో అధిక లోడు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ కల్పించడం తో జిల్లాలో దరఖాస్తులు చేసుకున్న 1,734 మంది విద్యుత్‌ కనెక్షన్‌లను క్రమబద్ధీకరించారు. దీని ద్వారా జిల్లా నుంచి 34 లక్షల 05 వేలు ఆదాయం వచ్చింది. కిలో వాట్‌ నుంచి ఐదు కిలో వాట్‌ వరకు క్రమబద్దీకరించేందుకు రాయితీలు ఇచ్చింది. మార్చి ఒకటో తేదీ నుంచి మొదలైన ఈ ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. జిల్లాలో విద్యుత్‌ వినియోగం అధికం. విద్యుత్‌ కనెక్షన్లు వేసుకునే సమయంవ తక్కువ కిలోవాట్స్‌కు దరఖాస్తులు చేసుకుంటున్నారు. తర్వాత ఏసీలు, ప్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్‌లు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అంచనాలకు మించి విద్యుత్‌ వినియోగం అవతుం ది. ఫలితంగా ఆయా ఇళ్లల్లో లో ఓల్టేజ్‌ సమస్య ఏర్పడు తుంది. అర్ధంతరంగా ఫీజులు కొట్టేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు నోచుకోవడం జరుగుతోంది. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొత్త విద్యుత్‌ కనెక్షన్‌లకు రెండు కిలో వాట్‌లకు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తక్కువ లోడు విద్యుత్‌ కనెక్షన్‌లు పొందిన వారు అదనపు లోడు వినియోగిస్తున్నారు. ఇలా వాడు తున్న వారిపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేసి జరిమా నాలు విధిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కిలోవాట్స్‌ను క్రమబద్ధీకరించేందుకు 50 శాతం రాయితీ కల్పించింది. గడువు దాటితే మరలా కిలోవాట్‌కు గతంలో ఉన్న ధరను చెల్లించాలి. వినియోగదారులు అధిక లోడు క్రమబద్ధీకరణ దరఖాస్తును www.apeasternpower.comలో దరఖాస్తు చేసుకోవాలి. దీనిని బట్టి అధికారులు లోడును క్రమబద్ధీకరిస్తారు.

50 శాతం రాయితీ ఇలా..

అదనపు లోడు అసలు ధర తగ్గింపు ధర

1 కిలో వాట్‌కు 2,250 1,250

2 కిలో వాట్‌కు 4,450 2,450

3 కిలో వాట్‌కు 6,650 3,650

4 కిలో వాట్‌కు 8,850 4,850

5 కిలో వాట్‌కు 11,050 6,050

డి విజన్‌ల వారీ దరఖాస్తులు

డివిజన్‌ వచ్చిన దరఖాస్తులు ఆదాయం(రూ.లక్షల్లో)

భీమవరం 338 6.36

నరసాపురం 373 6.94

తాడేపల్లిగూడెం 1,023 20.76

మొత్తం 1,734 34.05

Updated Date - Jun 17 , 2025 | 01:05 AM