నిధులివ్వండి.. మహాప్రభో!
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:41 AM
ఊరు బాగుపడాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలి. గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రతిపాదన వచ్చినా వాటిని సాకారం చేసేందుకు నిధులే ముఖ్యం. ఆది నుంచి ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం తలసరి గ్రాంట్‌ను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులను ఏకంగా పంచాయతీలకు ఇవ్వకుండానే అప్పట్లో కరెంటు బిల్లు లకు ముడిపెట్టారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలోను మళ్లీ సర్పంచ్‌లే వీధులకెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
వీధులకెక్కుతున్న పంచాయతీ ప్రతినిధులు
ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ఇలాంటి వేడుకోలే..
జగన్ హయాంలో దారిమళ్లిన 14వ ఆర్థిక సంఘం నిధులు
15వ సంఘంలోను తొలి విడత ఓకే
మలి విడతలోనే ప్రభుత్వం తకరారు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ఊరు బాగుపడాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలి. గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రతిపాదన వచ్చినా వాటిని సాకారం చేసేందుకు నిధులే ముఖ్యం. ఆది నుంచి ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం తలసరి గ్రాంట్‌ను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులను ఏకంగా పంచాయతీలకు ఇవ్వకుండానే అప్పట్లో కరెంటు బిల్లు లకు ముడిపెట్టారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలోను మళ్లీ సర్పంచ్‌లే వీధులకెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతీ ఆర్థిక సంవత్సరంలోను సర్పంచ్ దగ్గర నుంచి మిగతా ప్రతినిధులు మా ఊరికి రావా ల్సిన నిధులు ఎక్కడా అంటూ వీధులకెక్కి ధర్నాలు చేయాల్సిందే. అధికార పార్టీలో భాగ మైనా ఖాతరు చేయకుండా ఎదురు ప్రశ్నించా ల్సిందే. ఆర్థిక సంఘం నిధులు విడుదలైన ప్రతీ సారి ఇదే తంతు. ఆర్థిక సంఘం నిధులను తలసరి పేరిట గ్రామాభివృద్ధికి కేటాయిస్తారు. ఏటా రెండు విడతలుగా ఈ నిధులను పంచా యతీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. 2014–19 వరకు వివిధ ఆర్థిక సంఘాల ద్వారా వచ్చిన నిధులు పంచాయతీలకే వచ్చి చేరాయి. కాని జగన్ ప్రభుత్వంలో ఇదంతా తారుమారైంది.
జగన్ సర్కార్ కొత్త భాష్యం
జగన్ జమానా ఐదేళ్లల్లోను సర్పంచ్‌లుగా ఎన్నికైన పాపానికి గ్రామాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేకపోయారు. ఏకంగా 14వ ఆర్థిక సంఘం నిధులను అప్పటి జగన్ సర్కార్ దారి మళ్లించింది. ఇదెక్కడి అన్యాయమంటూ ప్రశ్నిం చిన సర్పంచ్‌పై కేసులు కట్టి కోర్టుల చుట్టూ తిప్పారు. వాస్తవానికి ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులు పంచాయతీల్లో కాస్తోకూస్తో అభివృద్ధికి చేదోడువాదోడుగా ఉండేవి. కాని ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులను వేరే వ్యవహారాలకు మళ్లించుకోవచ్చునంటూ జగన్ సర్కార్ కొత్త భాష్యం చెప్పింది. దీనికి అను గుణంగానే అప్పట్లో వచ్చిన నిధులను పంచా యతీల్లో కరెంటు బిల్లులు బకాయిలకు చెల్లిస్తు న్నట్టు అర్ధరాత్రి ప్రకటించి తెల్లవారేసరికల్లా కోట్ల రూపాయలు మళ్లించారు. ఈ విషయం తెలిసి సర్పంచ్‌లు లబోదిబోమన్నా పట్టించుకు న్నవారేరి.
కరెంటు బిల్లులతో ఓ తంటా
స్థానిక సంస్థల్లో విద్యుత్ వినియోగం అప్ప టికీ ఇప్పటికీ ఎంత అనేది ఎక్కడా కనిపించని దాఖలాలే. తాగునీటి అవసరాలకు, వీధిలైట్లకు విద్యుత్ వినియోగం మేజర్ పంచాయతీల్లో కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. చిన్న పంచా యతీల్లో వీధిలైట్లు తక్కువే, రోజువారి కరెంటు వాడకం అంతంత మాత్రమే. ఒక నెలకు పంచాయతీలో ఎంత విద్యుత్ బిల్లు వస్తుంద నేది బహిర్గతం చేయకపోవడంతో కేవలం బకా యిలు వచ్చేసరికి మాత్రమే.. ఇంత బకాయి పడ్డారంటూ విద్యుత్ శాఖ అధికారులు మౌఖి కంగానే తెలిపేవారు. ఇప్పటికీ కరెంటు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. ఎల్‌ఈడీ బల్బుల వాడకంతో విద్యుత్ డిమాండ్‌ను సగానికి సగం తగ్గించవచ్చునంటూ పల్లె, పట్నం తేడా లేకుం డా ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. అయితే మేజ ర్ పంచాయతీల్లో కరెంటు తగ్గకపోగా బిల్లులు మరింత పెరుగుతూ వచ్చింది. అందుకనే పంచాయతీల్లో కరెంటు బిల్లుల సమస్యే అతిపెద్ద సమస్య.
15వ ఆర్థిక సంఘం నిధులివ్వండి..
2024–25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం ద్వారా ఏలూరు జిల్లాకు దాదాపు రూ.70 కోట్లు కేటాయించారు. కేంద్రం నుంచి ఈ నిధులు విడుదలవుతాయి. వీటిని రెండు విడతలుగా ఆయా పంచాయతీల ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తొలి విడత నిధులను పంచాయతీలకు అప్పగించారు. మలివిడతకు వచ్చేసరికి జాప్య మవుతోంది. ఇప్పుడు ఆ నిధుల కోసమే సర్పం చ్‌లు ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థి తు ల్లో పంచాయతీలకు రావాల్సిన నిధులు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఇప్పటికే నాలుగేళ్లు తమ పదవీకాలం గడిచి పోయిం దని ఇప్పుడు కూడా ఇవ్వాల్సింది ఇవ్వ కుండా ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ అధికారు లపై విరుచుకుపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 531 గ్రామాల్లో ఈ నిధుల కోసమే పంచా యతీ పాలకమండళ్లు ఎదురుచూస్తున్నాయి.