Share News

15.33 లక్షల మంది ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:12 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీశక్తి పథకా న్ని మహిళలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నా రు.

 15.33 లక్షల మంది ఉచిత ప్రయాణం

ఆర్టీసీకి రూ.5.33 కోట్లు చార్జీల భారం

ప్రయాణాలకు అనువుగా ఏర్పాట్లు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీశక్తి పథకా న్ని మహిళలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నా రు. ఆర్టీసీలో మహిళలకు ఆగస్టు 15న ఉచిత ప్రారంభిం చడంతో నెల రోజుల్లో 15,33,721మంది ప్రయాణించారు. జిల్లాలో తొలుత 177 బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకా శం ఉండగా ఇటీవల మరో ఆరు బస్సులను పెంచారు. తెలంగాణ అంతరాష్ట్ర సర్వీసుల వద్ద జిల్లా తరపున కొత్త గా అశ్వారావుపేటకు బస్సులను పెంచారు. ఉచితానికి వాడుతున్న బస్సులు సంఖ్య 183కు చేరింది. ఆగస్టులో మొదట 16 రోజులకు 7,49,29 ప్రయాణించగా ఆదివారం నాటికి ఆ సంఖ్య 15,33,721మందికి చేరడం విశేషం. నెలరోజుల్లో ఏలూరు బస్సు డిపో నుంచి అత్యధికంగా 6,77,519 మంది ప్రయాణించారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి 5,32,618 మంది, నూజివీడు డిపో నుంచి 3,23,618 మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. నెలరోజుల మహిళా ప్రయాణికుల భారాన్ని ప్రభుత్వం రూ. 5,33,21,000 భరించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయాల్సి ఉంది.

బస్సుల్లో చిల్లర దొంగతనాలు, సెల్‌ఫోన్‌ దొంగతనాలు జోరు ఇటీవల తగ్గింది. మరోవైపు కండక్టర్లు ఉచిత టిక్కెట్లు ఇవ్వడానికి విసుగుచెందుతున్నారన్న ఆరోపణలు న్నాయి. సంబంధిత ఆధార్‌, రేషన్‌కార్డు చూపకపోతే టిక్కెట్లు జారీ చేస్తుండటంతో అక్కడక్కడ సమస్యలు ఉత్పనం అవుతున్నట్లు సమాచారం.

సమస్యలను అఽధిగమించాం

నిరంతరం మహిళల ప్రయాణాలను పర్యవేక్షిస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉత్పనం కాలేదు. కండక్టర్లు, డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తే ఆయా డీఎంలకు ఫిర్యాదు చేయవ చ్చు. విజయవాడలో సెంట్రల్‌ కంప్లైంట్‌ విభాగానికి వ్యక్తి గతంగా, మెయిల్‌ ద్వారా ప్రజలు సమస్యలను విన్నవిస్తు న్నారు. వాటిని సకాలంలో పరిష్కరిస్తున్నాం. ఇప్పటి వరకు సమస్యలేమి ఉత్పన్నం కాలేదు.

– షేక్‌ షబ్నం, డీపీటీవో

Updated Date - Sep 15 , 2025 | 12:12 AM