126 సెల్ ఫోన్లు బాధితులకు అందజేత
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:24 AM
దొంగతనానికి గురై, చేజార్చుకున్న రూ.18 లక్షల 90 వేల విలువైన 126 సెల్‌ఫోన్‌లను జిల్లా ఎస్పీ అద్నా న్ నయీం అస్మి బాధితులకు అందజేశారు. 11వ విడత సెల్‌ఫోన్ల రికవరీలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడా రు. విడతల వారీగా ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల 60 లక్షల విలువైన 1,738 సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించాం.
భీమవరం క్రైం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): దొంగతనానికి గురై, చేజార్చుకున్న రూ.18 లక్షల 90 వేల విలువైన 126 సెల్‌ఫోన్‌లను జిల్లా ఎస్పీ అద్నా న్ నయీం అస్మి బాధితులకు అందజేశారు. 11వ విడత సెల్‌ఫోన్ల రికవరీలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడా రు. విడతల వారీగా ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల 60 లక్షల విలువైన 1,738 సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించాం. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నట్లయితే 91549 66503 నంబర్‌కు వాట్సప్‌లో ‘హాయ్’ లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ చేసి, వచ్చిన లింకు ద్వారా మొబైల్ వివరాలు తెలిపితే మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసి అందిస్తాం. మొబైల్ ఫోన్లు చేజార్చు కోవడం, దొంగిలించబడడం, ప్రయాణాల్లో మరచిపోవడం జరిగినప్పుడు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ నెంబర్‌కు వాట్సప్ చేయాలి. ఎవరికైనా ఫోన్లు దొరికితే సొంతానికి వాడుకోవడం గాని, గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా బిల్లులు లేని సెల్‌ఫోన్లు కొనడం గాని చేయకండి. ఒకవేళ సెల్‌ఫోన్ దొరికితే దగ్గరలో వున్న పోలీస్ స్టేషన్‌లకు అందజేయాలి. దొంగతనం చేయలేదు కదా అని ఉపయోగిస్తే తర్వాత కేసుల్లో చిక్కుకోవలసి వస్తుంది. మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో కృషి చేసిన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ సభ్యులైన ఇన్‌స్పెక్టర్ అహ్మదున్నీసా, వారి సిబ్బంది ఏఎస్‌ఐ రత్నారెడ్డి, హెచ్‌సీ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, లక్ష్మీ కుమారి, పాపారావు, ప్రసాద్, అబ్బాస్, భాస్కర్, ప్రసాద్, అనిల్ కుమార్‌లను ఎస్పీ నయీం అభినందించారు. అదనపు ఎస్పీ భీమారావు, తదితరులు పాల్గొన్నారు.