ఒక్కరోజే 1,147 సమస్యలు పరిష్కారం
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:45 AM
22ఏ నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏలూరు కలెక్టరే ట్‌లో నిర్వహించిన మెగా గ్రీవెన్స్‌కు విశేష స్పందన లభించిం ది.
ఏలూరులో 22ఏ మెగా గ్రీవెన్స్‌కు మెగా స్పందన..
మంత్రి నాదెండ్ల, కలెక్టర్ వెట్రిసెల్వి 1,199 ఫిర్యాదుల స్వీకరణ
ఏలూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): 22ఏ నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏలూరు కలెక్టరే ట్‌లో నిర్వహించిన మెగా గ్రీవెన్స్‌కు విశేష స్పందన లభించిం ది. మంగళవారం ఉదయం పదిన్నరకు మొదలైన గ్రీవెన్స్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్‌కలెక్టర్ వినూత్న ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ‘ఒక్క రోజే 1,199 దరఖాస్తులు రాగా వాటిలో అప్పటికప్పుడు 1,147 దర ఖాస్తులు పరిష్కరించారు. 142.04 ఎకరాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాం. మరో 32 ఎకరాలకు సంబంధిం చి 11 కేసులను పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఎనిమిది కేసులను వారంలోగా, రెండు కేసులను రెండు వారాల్లోగా పరిష్కరించాల’ని మంత్రి నాదెండ్ల ఆదేశించాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 22ఏ భూముల పరిష్కారానికి చర్యలకు ఉపక్రమించామని, ఇది ప్రజలకు, రైతులకు శుభపరిణామం అని అన్నారు. ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, కామినేని శ్రీని వాస్, చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, డీఆర్వో వి విశ్వేశ్వరరావు, ఆర్డీవోలు అచ్యుత అంబరీష్, రమణ, జిల్లా రిజిస్ర్టార్ కె శ్రీనివాసరావు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కూచిపూడి శ్రీనివాస్, సర్వేలాండ్స్ రికార్డ్సు ఏడీ అన్సారీలు పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన
నగరంలో విజయ గార్డెన్స్‌లో 3.60 ఎకరాలను 22 ఏ జాబితాలో చేర్చడంపై అభివృద్ధి కమిటీ సభ్యులు బల్నీడి నరసింహారావు, మరికొందరు ప్లాట్ల యజమానులు తమ సమస్యను మంత్రి నాదెండ్ల, కలెక్టర్ వెట్రిసెల్వికి వివరించారు. నవంబరు 1న ‘ఎన్నాళ్లీ నిషేధం’ శీర్షికన ప్రచురితమైన కథ నాన్ని వారు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి సమస్యలను 14 రోజుల్లో క్లియర్ చేయాలని ఎండోమెంట్, రెవెన్యూ శాఖలను ఆదేశించారు.
ఇతర సమస్యలపై వెనుక్కు
అర్జీదారులందరికి మధ్యాహ్న భోజన సౌకర్యంతోపాటు టెంట్లు, కుర్చీలు వేసి కార్యక్రమాన్ని సజావుగానే సాగించారు. అయితే ప్రీహోల్డ్, ఇతర సమస్యలను అర్జీలను మంత్రి, కలెక్టర్ తీసుకోకుండా ఆర్డీవోలు, ఇతర అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. వారు వీటిని తీసుకుని అర్జీదారులను మరోసారి రావాలని కోరారు. ప్రీహోల్డ్ భూములపై నిషేథం ఎత్తివేతపై త్వరలో జీవో ఇస్తుందని అధికారులు చెప్పి అర్జీదారులను పంపించేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమ దర ఖాస్తులు స్వీకరించకపోవడంతో అర్జీదారులు ఇబ్బంది పడ్డారు. తర్వాత తేరుకున్న అధికారులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను ఆలకించి పరిష్కార మార్గాలపై ఆదేశాలు జారీచేశారు. ద్వార కాతిరుమల, ఉంగుటూరు, ఏలూ రు అర్బన్, కొయ్యలగూడెం, కామవరపుకోట, పెదపాడు, పెద వేగి మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు.
మూడు గంటలు నిల్చోపెట్టి పంపించేశారు
యనమదల రామదాస్, ఎక్స్ సర్వీస్‌మెన్
మాది నూజివీడు మండలం మర్రిబంధం. ఆర్మీలో సుబే దార్‌గా పనిచేశా. ప్రభుత్వం నాకు రెండెకరాల 50 సెంట్ల కేటాయిస్తే ఇందులో రెండు ఎకరాలు జగనన్న కాలనీకి, ఆరు సెంట్లు హెల్త్‌క్లినిక్ ఇచ్చాను. మిగిలిన 44 సెంట్ల భూమి 22ఏ జాబితాలో చేర్చారు. నాకు న్యాయం చేయాలని అర్జీ దాఖలు చేయడానికి వస్తే మూడు గంటలు నిలబెట్టి వెళ్లిపోమన్నారు.
సాగు, తాగునీటికి ఇబ్బంది రానీయొద్దు
ఐఏబీ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి):రానున్న రబీలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు.. వేసవిలో తాగునీటి సమ స్యలు తలెత్తకుండా జలవనరులు, వ్యవసాయ, ఇతర శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏలూరు జిల్లా సాగు నీటి సలహా మండలి(ఐఏబీ) సమావే శం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన నాదెండ్ల మాట్లాడుతూ రబీ పంటకు సాగు నీరు, వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను పక్కాగా మండ లాల వారీగా అమలు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాల్లో సాగు, తాగు నీటికి 26 టీఎంసీలు నీరు అవసరమని, కానీ ప్రస్తుతం 73.36 టీఎంసీలు నీరు మాత్రమే లభ్యత ఉందని, అదనంగా కావాల్సిన 19.90 టీఎంసీలు నీటిని సీలేరు జలాలు విషయమై అక్కడి అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుందామని మంత్రి అభయం ఇచ్చారు. బుడమేరు వద్ద మరమ్మతులు కారణంగా నీటి సరఫరాకు కృష్ణా కాల్వకు ఇబ్బంది ఉంటుం దని అధికారులు వివరించగా, దీని విషయంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, ఎమ్మెల్యేలు పత్స మట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్, జలవనరుల శాఖ ఎస్‌ఈ సీహెచ్ దేవప్రకాష్, వ్యవసాయశాఖ జేడీ హబీబ్, ఆర్డీవోలు అచ్యుత్ అంబరీప్, బొల్లిపల్లి వినూత్న, జిల్లాలోని అన్ని సాగునీటి సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.