Share News

11 రోడ్లు.. రూ.30.18 కోట్లు

ABN , Publish Date - Oct 09 , 2025 | 01:39 AM

జిల్లాలో పలు నియోజక వర్గాల్లో 11 ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యా యి. రాష్ట్ర హైవేలను అనుసంధానం చేసే ఈ రోడ్లకు రూ.30.18 కోట్లు మంజూరయ్యాయి.

  11 రోడ్లు.. రూ.30.18 కోట్లు
కొయ్యలగూడెం మండలం యర్నగూడెం–పొంగుటూరు రోడ్డు

ఏలూరు,అక్టోబరు 8 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో పలు నియోజక వర్గాల్లో 11 ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యా యి. రాష్ట్ర హైవేలను అనుసంధానం చేసే ఈ రోడ్లకు రూ.30.18 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఉత్త ర్వులిచ్చారు. ఎండీఆర్‌ ప్లాన్స్‌ అదనపు నిధుల మంజూరు కోసం రెండు నెలలు క్రిత మే ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరిం చగా, ఇంత వేగంగా నిధులను మంజూరు చేయడంపై పలు నియోజకవర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

నిధులు మంజూరైన రోడ్లు

ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు– మేడిశెట్టి వారిపాలెం 6.3 కిలోమీటర్లకు రూ.2.80 కోట్లు, ఏలూరు పాతబస్టాండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఏలూరు టౌన్‌ లిమిట్స్‌లో గూడ్స్‌షెడ్‌ రోడ్డు– ఏలూరు టౌన్‌ ప్రారం భం (మార్కెట్‌యార్డు) వరకు 3.26 కి.మీలకు రూ.2.60 కోట్లు, నూజివీడు నియోజకవర్గంలోని మచిలీపట్నం– నూజి వీడు– వయా కల్లూరు రోడ్డు 5.6 కి.మీలకు రూ.2 కోట్లు, గోప వరం– మీర్జాపురం 9 కి.మీలకు రూ.3.93 కోట్లు, బయ్యనగూడెం– రేగుల గుంట 8.40 కి.మీలకు రూ.3కోట్లు, పోలవరం నియోజకవర్గం కొయ్యల గూడెం మండలం పరిధిలో యర్నగూడెం– పొంగుటూరు ఏలూరు జిల్లా పరిధిలో 1.8 కి.మీలకు రూ.కోటి మంజూరయ్యాయి. దెందు లూరు నియోజకవర్గంలో ఈజీకే రోడ్డు – డీపీ రోడ్డు వయా మలకచర్ల 4.70 కి.మీలకు రూ.2.95 కోట్లు, కేడీపురం– పైడి చింత పాడు వయా గుడివాకలంక, ప్రత్తికోళ్లలంక 3.80 కి.మీలకు రూ.3.35 కోట్లు, కైకలూ రు నియోజకవర్గంలో లోపూడి నుంచి కొత్త గూడెం రోడ్డు 2 కి.మీలకు రూ.2.35కోట్లు, చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి– కామవర పుకోట 4.20 కిమీలకు రూ.1.90 కోట్లు, ఉంగుటూరు నియోజక వర్గం కైకరం– గుణ్ణంపల్లి వయా గుండుగొలను నుంచి కోరుకల్లు ఐదు కి.మీలకు రూ.4.30 కోట్లు నిధులు మంజూరయ్యాయి. కాగా కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలిసిన రెండు రోడ్లకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. జంక్షన్‌ సమీపంలోని నూజివీడు–వయా కల్లూరు రోడ్డు, కైకలూరు నియోజక వర్గంలో లోపూడి కొత్తగూడెం రోడ్లకు మోక్షం కలగనుంది.

Updated Date - Oct 09 , 2025 | 01:39 AM