Share News

పెద్ద పరీక్షే!

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:53 PM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమ వుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మార్చి పదో తేదీ వరకు విద్యాశాఖ నిర్వహించ తలపెట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రారంభ దశలోనే ప్రకంపనలు పుట్టిస్తోంది.

 పెద్ద పరీక్షే!

పది ఉత్తీర్ణతకు వంద రోజుల కార్యాచరణ

అడాప్షన్‌ ఆఫీసర్ల పర్యవేక్షణ..అభ్యంతరాలు!

జిల్లాలో 256 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 12వేల మందికి పైగా పరీక్షార్థులు

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమ వుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మార్చి పదో తేదీ వరకు విద్యాశాఖ నిర్వహించ తలపెట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రారంభ దశలోనే ప్రకంపనలు పుట్టిస్తోంది. టెన్త్‌ పరీక్ష ల్లో ఉత్తీర్ణతను పెంచుకునే క్రమంలో చదువులో వెనుకబడిన విద్యార్థులు (రైజింగ్‌ స్టార్స్‌) మంచి మార్కులు/గ్రేడులు సాధించడానికి, ఇప్పటికే ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు (షైనింగ్‌ స్టార్స్‌) 600/600 మార్కులను వీలై నంత ఎక్కువమంది సాధించేలా ప్రోత్సహించ డానికి వంద రోజుల కార్యాచరణను ఉద్దేశిం చారు. ఆమేరకు అన్ని ప్రభుత్వ ఉన్నతపాఠ శాలల్లో పదో తరగతి పరీక్షార్థులకు ఉదయం 8నుంచి 9గంటల వరకు ప్రత్యేక తరగతులు, రెగ్యులర్‌ క్లాసులు ముగిసిన అనంతరం సా యంత్రం 4నుంచి 5గంటలవరకు సంబంధిత సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. రోజువారీ నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను లీప్‌ యాప్‌లో నమో దు చేయడం, జవాబు పత్రాలను భద్రపర్చడం ద్వారా బాలబాలికల ప్రగతిని పర్యవేక్షించడం, వెనుకబడినవారికి మరింతగా బోధించడం వంటివి చేస్తారు. ఇలా చేయడం ద్వారా టెన్త్‌ పరీక్షల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యారు ్థలు మంచి ఉత్తీర్ణతను పొందాలన్నది విద్యాశా ఖ లక్ష్యంగా ఉంది. దీనికనుగుణంగానే అన్ని జిల్లాల్లో ఈనెల 6నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు అమలయ్యేలా 100 రోజుల కార్యాచరణను నిర్ధేశించారు.

జిల్లాలో 256 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో..

విద్యాశాఖ డైరెక్టర్‌ సూచనల మేరకు జిల్లాలోని 256 ప్రభు త్వ ఉన్నత పాఠశాలల్లో 100 రోజుల కార్యాచరణ నిర్ధేశిత షెడ్యూలు ప్రకారం అమల వుతున్నదీ, లేనిదీ పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో వివిధ శాఖల మండలస్థాయి అధికారులను దత్తత అధికారు లు (అడాప్షన్‌ ఆఫీసర్లు)గా నియమించడానికి వీలుగా జిల్లా విద్యాశాఖకు అనుబందంగా పనిచేసే జిల్లా కామన్‌పరీక్షల బోర్డు (డీసీఈబీ) ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. అడాప్షన్‌ ఆఫీసర్లుగా విద్యాశాఖేతర అధికారులను గుర్తిం చి వారి ఫోన్‌ నంబర్లతో సహా, వివరాలను తక్షణమే డీసీఈబీ కార్యాలయానికి పంపాలని ఉత్తర్వులు జారీకాగా, కొన్ని మండలాల నుంచి ఎంఈవోలు తమ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల వారీగా నియమించడానికి వీలున్న రెవెన్యూ, పశుసంవర్ధకశాఖ, గ్రామీణ నీటిసర ఫరా, తదితర శాఖల నుంచి స్థానిక అధికారుల వివరాలతో కూడిన నివేదికలను కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపీడీవోలు రూపొందించా రు. సంబంధిత శాఖల క్షేత్రస్థాయి అదికారుల ను అడాప్షన్‌ ఆఫీసర్లుగా నియమించడానికి ఆయా డిపార్ట్‌మెంట్ల జిల్లా హెచ్‌వోడీలకు ఉత్త ర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. మార్చినెల రెండో వారం నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా, అప్పటివరకు హైస్కూ ళ్లలో రెండో శనివారం సెలవులు, ఆదివారం సెలవులతో సహా ప్రత్యేక తరగతులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం జరిగేలా పర్యవేక్షించడం అడాప్షన్‌ ఆఫీసర్ల బాధ్యతగా ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది టెన్త్‌ పరీక్షలు రాసేందుకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 12వేల మందికి పైగా బాలబాలికలు సన్నద్ధమవుతున్నారు. పరీ క్షఫీజు చెల్లింపునకు ఇంకా గడువు వున్నందున పరీక్షార్థుల సంఖ్యలో కొద్దిపాటి మార్పులుం టాయి. సెలవు రోజుల్లో సైతం నిర్వహించే ప్రత్యేక తరగతులను విద్యార్థులు నూరుశాతం విజయవంతంగా వినియోగించుకునేందుకు వీలుగా ఆయా రోజుల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలుచేయడానికి విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది.

విద్యాశాఖేతర అధికారులతో టీచర్లను అగౌరవపరుస్తారా?

వందరోజుల కార్యాచరణను హైస్కూలుస్థాయిలో విద్యాశాఖేతర అధికారులతో పర్యవేక్షింపజేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. బోధనా కార్యక్రమాలు, పాఠ్యాంశాలు, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలతో పరిచయంలేని ఇతరశాఖల అడాప్షన్‌ ఆఫీసర్లు రోజువారీ పర్యవేక్షణతో ఉపాధ్యాయుల తప్పులను వెతకడానికే ప్రాధాన్యతనిస్తారని అభ్యంతరం చెబుతున్నాయి. అవసరమైతే విద్యాశాఖకు సంబంధించిన సీనియర్‌ హెచ్‌ఎంలు, డైట్‌ కళాశాలల అధ్యాపకులు, డీవైఈవోలు, ఎంఈవోలతో వందరోజుల కార్యాచరణను రోజువారీగా పర్యవేక్షించుకోవడానికి నియమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. గతంలోను టెన్త్‌ పరీక్షార్థులకు వందరోజుల కార్యాచరణను అమలు చేసినప్పటికీ ఇప్పటి మాదిరాగా ఇతర శాఖల నుంచి అడాప్షన్‌ ఆఫీసర్లను పర్యవేక్షకులుగా నియమించలేదని గుర్తుచేస్తున్నాయి. దీనిపై ఏపీటీఎఫ్‌–1938 జిల్లా నాయకులు కృష్ణ, మోహన్‌, శ్రీనివాసరావు మాట్లాడుతూ వందరోజుల కార్యాచరణతో ఉపాధ్యాయులపై అనవసరమైన పనిభారం పెరుగుతుందని, పాఠ్యాంశాల రివిజన్‌ తగ్గిపోవడం వల్ల ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు బోధన కంటే లీప్‌ యాప్‌లో అప్‌లోడ్‌, డేటా ఎంట్రీ పనులకే ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుందని, ఇది బోధనేతర పనులతో టీచర్లను వేధించడమేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతరశాఖల అధికారులకు పర్యవేక్షణ అప్పగించడం, యాప్‌లో టీచర్లే మార్కులు అప్‌లోడ్‌ చేయాల్సి రావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అవసరమైతే లీప్‌ యాప్‌లో మార్కులను అప్‌లోడ్‌చేసే బాధ్యతను సీఆర్పీ/సీఎంఆర్టీలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌ అనుమతి రావాల్సి ఉంది

ప్రభుత్వ ఆదేశాలమేరకే అడాప్షన్‌ ఆఫీసర్ల నియామకం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో వందరోజుల కార్యాచరణ విజయవంతం కావ డానికే అందుబాటులో ఉండే ఇతరశాఖల అధికారులకు పర్యవేక్షణ అప్పగిస్తున్నామే తప్ప, దీనిపై అభ్యంతరం చెప్పడానికి అవకా శం లేదు. మండలాల వారీగా అడాప్షన్‌ ఆఫీ సర్ల వివరాలను ఎంఈవోల ద్వారా డీసీఈబీ సేకరిస్తోంది. దత్తత అధికారుల నియామకా నికి సంబంధిత శాఖల హెచ్‌వోడీలు ఆదే శాలు జారీ చేయడానికి వీలుగా నివేదికను కలెక్టర్‌కు ఒకట్రెండు రోజుల్లో ఇస్తాం.

– డీఈవో వెంకట లక్ష్మమ్మ

Updated Date - Dec 07 , 2025 | 11:53 PM