Share News

టెన్‌షన్‌ తీర్చేలా..

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:36 AM

ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభు త్వ విద్యను తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగు తోంది. ప్రభుత్వ పాఠశాలల బోధనలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.

టెన్‌షన్‌ తీర్చేలా..

ప్రైవేటుకు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన

తొమ్మిదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి టెన్త్‌ పాఠాలు

ప్రాథమిక స్థాయి నుంచే ఫౌండేషన్‌ కోర్సులు

భీమవరం రూరల్‌, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి):ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభు త్వ విద్యను తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగు తోంది. ప్రభుత్వ పాఠశాలల బోధనలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలోనూ ఉత్తమ ఫలితాలు సాధించే దిశ గా పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు. డిసెం బరు ఒకటో తేదీ నుంచి వంద రోజుల ప్రణాళిక అమలు కానుంది. ఈలోగా విద్యార్థుల ప్రతిభా పాటవాలను అంచనా వేస్తున్నారు. వారిని ఎ, బి,సి,డి కేటగిరీలుగా విభజిస్తున్నారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విద్యార్థులను చది వించేటప్పుడు ఎ, బి కేటగిరీ విద్యార్థులకు ఒకలా, సి, డి కేటగిరీ విద్యార్థులకు మరోలా చదివించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళ ల్లో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయనున్నారు.

ముగ్గురు విద్యార్థుల ఎంపిక

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో మంచి మార్కులు సాధించే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ ఏడా ది నుంచి మంచి మార్కులు తెచ్చుకునే విద్యా ర్థులను గుర్తిస్తున్నారు. ప్రతి పాఠశాలలోనూ ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నారు.

పదిలోపే జిల్లా స్థానం

కొన్నేళ్లుగా జిల్లా ఉత్తీర్ణతా శాతం పడిపో యింది. గత ఏడాది 16వ స్థానంలో నిలిచింది. ఈసారి 10లోపు ర్యాంకు సాధించాలన్న పట్టుద లతో జిల్లా విద్యాశాఖ ప్రణాళిక చేస్తోంది. ఉపా ధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఇప్పటి నుంచే దిశా నిర్దేశం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగితే జిల్లా స్థానం మెరుగు పడుతుంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. జిల్లా నుంచి ఈ ఏడాది టెన్త్‌లో ప్రభుత్వ పాఠ శాలల్లో 12,890 మంది, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 10,337 మంది విద్యార్థులు చదువుతు న్నారు.

తొమ్మిది విద్యార్థులకు పది సిలబస్‌

ప్రైవేటు పాఠశాలల తరహాలోనే వచ్చే ఏడా దికి విద్యార్థులను సమాయత్తం చేస్తున్నారు. ఈ ఏడాది తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ఫిబ్రవరి నాటికి సిలబస్‌ పూర్తి కానుంది. ఆ తర్వాత పదో తరగతి సిలబస్‌ను ప్రారంభిస్తారు. అంటే ఈ ఏడాదే తొమ్మితో తరగతి విద్యార్థులకు టెన్త్‌ సిలబస్‌ పాఠాలను బోధిస్తారు. దీనివల్ల టెన్త్‌లోకి వచ్చే నాటికి విద్యార్థులపై ఒత్తిడి తగ్గు తుంది. మంచి మార్కులు సాధించడానికి ఉప యోగపడుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించడానికి ఇదొక కారణంగా విద్యా శాఖ గుర్తించింది.

విద్యార్థులకు ఫౌండేషన్‌ కోర్సు

ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఫౌండేషన్‌ కోర్సును బోధించ నున్నారు. దీనివల్ల ఇంటర్‌ తర్వాత పోటీ పరీక్షలకు సమాయత్తం చేయాలన్న సంకల్పంతో విద్యా శాఖ ఫౌండేషన్‌ కోర్సుకు శ్రీకారం చుట్టిం ది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచారు. కానీ ప్రైవేటు పాఠశాలలతో దీటుగా బోధన అందించలేకపోతున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఫౌండేషన్‌ కోర్సుల ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచే యోచనలో విద్యాశాఖ సన్నాహాలు చేసుకుంటోంది.

Updated Date - Nov 06 , 2025 | 12:36 AM