Share News

శభాష్‌ కండక్టర్‌ గిరిజమ్మ

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:02 AM

మదనపల్లెకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ గరిజమ్మ తన నిజాయితీని చాటుకున్నారు.

శభాష్‌ కండక్టర్‌ గిరిజమ్మ
దొరికిన బంగారు గొలుసును అందిస్తున్న కండక్టర్‌ గిరిజమ్మ

మదనపల్లె అర్బన, జనవరి 5(ఆం ధ్రజ్యోతి):మదనపల్లెకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ గరిజమ్మ తన నిజాయితీని చాటుకున్నారు. ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో రూ. 2.50 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును శనివారం రాత్రి పోగొ ట్టుకున్నాడు. బస్సులో దొరికిన బంగారు గొలుసును నిజాయితీగా మదనపల్లె టూటౌన సీఐ రామ,ంద్రకు కండక్టర్‌ గిరిజమ్మ అందజేశారు. సీఐ ఆదే శాలతో ఏఏస్‌ఐ రమణ, కానిస్టేబుట్‌ మహేష్‌లు గొలుసుపోగొట్టుకున్న వక్తి కోసం గాలించారు. రంగంపేటకు చెందిన శివకుమార్‌ను గుర్తించి అతనిని మదనపల్లె స్టేషనకు పిలిపించి 40 గ్రాముల బంగారు గొలుసును అప్పజెప్పారు. ఈ సందర్భం గా గిరిజమ్మను, ఆమె నిజాయితీని శభాష్‌ అంటూ వారు అభినందించారు.

Updated Date - Jan 06 , 2025 | 12:02 AM