TDP Mahanaadu: తొలిరోజు తీర్మానాలు
ABN , Publish Date - May 28 , 2025 | 05:41 AM
మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరు శాసనాలను ప్రవేశపెట్టారు. కార్యకర్తల అధినేతత్వం, సంక్షేమం, పెట్టుబడులు, యువత అభివృద్ధిపై పార్టీ నేతలతో కలిసి తీర్మానాలు బలపరిచారు.
కడప, మే 27 (ఆంధ్రజ్యోతి): మహానాడులో తొలిరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరు శాసనాలను ప్రవేశపెట్టారు. భోజన విరామానికి ముందే వీటిని ప్రవేశపెట్టగా.. విరామం తర్వాత ఆ శాసనాలకు అనుబంధ తీర్మానాలను పార్టీ నాయకులు ప్రవేశపెట్టి బలపరిచారు. ఆయా తీర్మానాల వివరాలు...
‘కార్యకర్తే అధినేత’ తీర్మానాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టగా ఇదే తీర్మానంలో భాగంగా సంస్థాగత నిర్మాణం విషయంపై గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు. క్యాడర్ నుంచి ఎంపిక చేసిన పిచ్చేటి వెంకట నరసింహ, సాలూరు మండల పార్టీ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌నాయుడు ఈ తీర్మానాన్ని బలపరిచారు.
‘కార్యకర్తల సంక్షేమం’ తీర్మానాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రవేశపెట్టగా, తిరుపతి రూరల్ ప్రెసిడెంట్ ఈశ్వర్‌రెడ్డి, మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన మండల ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ బలపరిచారు.
‘పెట్టుబడులు- ఉపాధి అవకాశాలు’ తీర్మానాన్ని మంత్రి టీజీ భరత్, ‘యువత సంక్షేమం’ అనే తీర్మానాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రవేశపెట్టారు. కడప జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా, తెలంగాణ యువనేత జయరామ్ యువత సంక్షేమం తీర్మానాన్ని బలపరిచారు.
‘ప్రజాపాలనలో సాంకేతిక విప్లవం’ తీర్మానాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రవేశపెట్టగా, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల నరసింహ బలపరిచారు.
‘మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం’ తీర్మానాన్ని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రవేశపెట్టగా శ్రీకాళహస్తికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశి బలపరిచారు.
‘పేదరికం లేని సమాజం-పీ4 సంకల్పం’ తీర్మానాన్ని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ప్రెసిడెంట్ వేమూరి కుమార్ ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ బలపరిచారు.
‘స్వర్ణాంధ్ర విజన్-2047 సాధన దిశగా ఆంధ్రప్రదేశ్’ తీర్మానాన్ని బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ ప్రవేశపెట్టారు.
బీసీ సంక్షేమ తీర్మానాన్ని ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎస్సీ సంక్షేమ తీర్మానాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎస్టీ సంక్షేమ తీర్మానాన్ని జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ కిడారు శ్రావణ్, మైనార్టీ సంక్షేమ తీర్మానాన్ని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, క్రైస్తవ సంక్షేమ తీర్మానాన్ని స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దిరాల మేనీ, బ్రాహ్మణ సంక్షేమ తీర్మానాన్ని రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, వైశ్యుల సంక్షేమం తీర్మానాన్ని వైశ్యుల కార్పొరేషన్ చైర్మన్ రాకేశ్, కాపు సంక్షేమ తీర్మానాన్ని విశాఖపట్నం డీసీఎంఎస్ బాలాజీ, మహిళా శిశుసంక్షేమం- సాధికారత తీర్మానాన్ని మంత్రి సవిత ప్రవేశపెట్టగా మంత్రి సంధ్యారాణి, జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న బలపరిచారు. ‘సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం’ తీర్మానాన్ని మంత్రి అచ్చెన్న ప్రవేశపెట్టగా, మాజీ మంత్రి దేవినేని ఉమా బలపరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News