నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తాం
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:20 PM
కోళ్ల ఫారాల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే ఫారాలను సీజ్ చేస్తామని తహసీల్దార్ తపశ్విని, ఎంపీడీఓ రమేష్ హెచ్చరించారు. గురువారం రెడ్డివారిపల్లి పంచాయతీ పిట్టావాండ్లపల్లి వద్ద నున్న కోళ్ల ఫారాలను తనిఖీ చేసిన వారు మాట్లాడుతూ కోళ్ల ఫారాల వ్యర్థాలు, చనిపోయి న కోళ్ల ద్వారా ఈగలు ప్రబలకుండా బాయిలర్ చేసి వాసన రాకుండా శానిటేషన్ చేయాలని తెలిపారు.
కోళ్ల ఫారాలను తనిఖీ చేసిన తహసీల్దార్
నిమ్మనపల్లి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): కోళ్ల ఫారాల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే ఫారాలను సీజ్ చేస్తామని తహసీల్దార్ తపశ్విని, ఎంపీడీఓ రమేష్ హెచ్చరించారు. గురువారం రెడ్డివారిపల్లి పంచాయతీ పిట్టావాండ్లపల్లి వద్ద నున్న కోళ్ల ఫారాలను తనిఖీ చేసిన వారు మాట్లాడుతూ కోళ్ల ఫారాల వ్యర్థాలు, చనిపోయి న కోళ్ల ద్వారా ఈగలు ప్రబలకుండా బాయిలర్ చేసి వాసన రాకుండా శానిటేషన్ చేయాలని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజ నంలో ఈగలు పడుతూ పిల్లలు తినేసమయంలో కూడా ఈగలు వాలుతుండంతో కోళ్ల ఫారాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీ కార్య దర్శి గాయత్రి నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో గ్రామంలో ఈగలు రాకుండా చూసే భాద్యత నిర్వాహకులదే అని గ్రామ సమీపంలో చనిపోయి న కోళ్లను వేయరాదన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుతం వున్న కోళ్లు అయి పోగానే కోళ్ల ఫారాలను నిలిపివేస్తామని ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటా మని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్‌ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.