Share News

ముతకనవారిపల్లిలో టీడీపీ కుటుంబాలకు తాగునీరిస్తాం

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:01 AM

మండలంలోని వెంగంవారిపల్లి పంచా యతీ ముతకనవారిపల్లిలో ఉన్న టీడీపీ కుటుంబాలకు తాగునీరిస్తామని ఎంపీ డీవో పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

ముతకనవారిపల్లిలో టీడీపీ కుటుంబాలకు తాగునీరిస్తాం
ముతకనవారిపల్లిలో గ్రామస్థులతో మాట్లాడున్న ఎంపీడీవో పరమేశ్వర్‌రెడ్డి

నిమ్మనపల్లి ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంగంవారిపల్లి పంచా యతీ ముతకనవారిపల్లిలో ఉన్న టీడీపీ కుటుంబాలకు తాగునీరిస్తామని ఎంపీ డీవో పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్ర వారం ‘ఆంధ్రజ్యోతి’లో టీడీపీ కుటుం బాలకు ఐదేళ్లగా తాగునీరు నిలిపివేత అనే వార్తకు స్పందించిన ఎంపీడీవో పర మేశ్వర్‌రెడ్డి, అధికారులతో కలిసి ముతకనవారిపల్లిలో పర్యటించి గ్రామంలో నెల కొన్న పరిస్థితులపై విచారించారు. శనివారం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతి బోరు గ్రామంలో అందరికి చెందినదని కొంత మంది మాత్రమే నీరు పట్టుకొని మిగిలిన వారి కి ఇవ్వకుండా తాళం వేయడం చట్టరీత్యా నేరమన్నారు. బోరు వద్ద నుంచిపైపు లైను ఏర్పాటు చేసి రెండు రోజుల్లో తాగునీరు అందించాలని కార్యదర్శిని అదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మిధునచక్రవర్తి, కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:01 AM