వాల్టా ?
ABN , Publish Date - Sep 04 , 2025 | 10:58 PM
మొక్క లను పెంచండి, చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ఓ వైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవిలో జోరీగలా ఊదరగొడుతున్నా, అవగాహన సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాపారులు వృక్షాలను ఇష్టానుసారంగా నరికేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి.
అడ్డూ అదుపు లేకుండా కలప రవాణా
పర్యవేక్షణ కొరవడడమే కారణమా ?
చోద్యం చూస్తున్న అటవీ అధికారులు
వాల్మీకిపురం, సెప్టెంబరు4 (ఆంధ్రజ్యోతి): మొక్క లను పెంచండి, చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ఓ వైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవిలో జోరీగలా ఊదరగొడుతున్నా, అవగాహన సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాపారులు వృక్షాలను ఇష్టానుసారంగా నరికేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి. అక్రమార్కులు యధేచ్ఛగా చెట్లను తొలగిం చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కేంద్రం వాల్టా చట్టాన్ని తెచ్చి వాటికి కొన్ని నిబంధనలు రూపొందించి ఇందులో మొక్కల సంరక్షణ కూడా చేర్చినా అక్రమార్కులు వాల్టా చట్టాన్ని సైతం చుట్టి చూరులో పెట్టడం సరదాగా ఉంది. వాల్టా చట్టాన్ని సైతం తుంగలో తొక్కుతూ పచ్చదనాన్ని నిలువునా నరికేస్తున్నారు. చెట్టును బట్టి కలపను ఇంటి పనులకు, మరికొన్నింటిని వ్యాపారం నిమి త్తం తరలించేస్తున్నారు.
రోడ్డు పక్కగా కలప ట్రాక్టర్లు
అవకాశం దొరికితే ఎక్క డి కలపనైనా రవాణా చేసేందుకు పథకం రూ పొందిస్తుంటారు. ఫలితంగా కలప అక్రమ రవా ణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కలప వ్యాపారుల ధాటికి విలువైన వేప, టేకు, మామి డి, చిగురు, మర్రి, చింత, నీలగిరి, ఊడుగ, రోజ్ వుడ్, కానుగ చెట్లు అంతరించిపోతున్నాయి. మండలంలోని పలు ప్రాంతాల నుంచి వృక్షాలను నరికి అప్పనంగా సొమ్ము చేసుకుంటుండం గమ నార్హం. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావర ణాన్ని కాపాడాలంటుంటే చెట్ల నరికివేత, అక్రమ రవాణాకు అధికారులు కూడా అడ్డు కట్ట వేయ లేకపోతున్నారు. వాల్మీకిపురం పట్టణం బైపాస్ రోడ్డులో ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోనే అటవీ అధికారులు కార్యాలయం ఉంది.
వాల్మీకిపురం - గొల్లపల్లె రోడ్డులో చాటుగా పెట్టిన కలప ట్రాక్టర్లు
అయితే ఏమైందిలే అన్న చందంగా అదే కార్యాలయం ముందు నుంచే కలపను అక్రమంగా తరలించు కు పోతుంటారు. వీటిపై అటవీ అధికారులు ఏ మాత్రం నిఘా పెట్టలేదన్న విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవ డడంతో రవాణా సమయంలో అనుమానం వస్తే పట్టణానికి సమీపంలోని గొల్లపల్లె రోడ్డు చాటుగా ను, బైపాస్ రోడ్డులో ముళ్ల పొదల చాటున కల ప రోడ్లు (ట్రాక్టర్లలో) పెట్టి అటవీ అధికారులు వెళ్లిపోయిన తరువాత బయటి ప్రాంతాలకు తర లిస్తున్నారు. వృక్ష సంపదను ఇష్టారాజ్యంగా కొల్ల గొడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై అటవీ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే అందుబాటులో లేకపోవడం గమనార్హం.