VVIIT Now a University with MBA and BBA Courses: విశ్వవిద్యాలయంగా వీవీఐటీ కళాశాల
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:25 AM
వీవీఐటీ కళాశాల ఇప్పుడు వీవీఐటీ విశ్వవిద్యాలయంగా స్థాపితమైంది. 40 ఏళ్లుగా విద్యలో నాణ్యత అందిస్తున్న ఈ సంస్థ, కొత్తగా మేనేజ్‌మెంట్ స్టడీస్ (MBA, BBA) కోర్సులతో యూనివర్సిటీ హోదాలో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సజావుగా చేస్తోంది

40 ఏళ్లుగా విద్యార్థుల భవిష్యత్‌లో భాగస్వామ్యం
ఈ విద్యాసంవత్సరం నుంచి మేనేజ్‌మెంట్ స్టడీస్
పెదకాకాని, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): వీవీఐటీ కళాశాల, వీవీఐటీ విశ్వవిద్యాలయం(వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నో లాజికల్ యూనివర్సిటీ)గా రూపాంతరం చెందిందని విద్యాసంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వీవీఐటీ వర్సిటీ ప్రాంగణంలో గురువారం విశ్వవిద్యాలయం లోగో, బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రకటనకు తగ్గట్టు కేవలం రెండు నెలల వ్యవధిలో ప్రభుత్వం వీవీఐటీ అభ్యర్థనను పరిశీలించి యూనివర్సిటీ హోదాను కల్పించిందని చెప్పారు. మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 40 సంవత్సరాలు క్రితం ప్రారంభమైన విద్యాసంస్థ యూనివర్సిటీ స్థాయికి ఎదగడం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో భాగం కావడం సంతోషాన్ని అందించిందన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో అప్పా స్కూల్ ఆఫ్ బిజినె్‌సను ప్రారంభించి మేనేజ్‌మెంట్ స్టడీ్‌స(ఎం.బి.ఎ, బి.బి.ఎ) అందించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలనే నినాదంతో వీవీఐటీ సంస్థలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులకు క్రమశిక్షణతో, విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందించడం తమ లక్ష్యం అని తెలిపారు. అడ్మిషన్స్ డైరెక్టర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రవేశ పరీక్షలో ఫలితాల ప్రామాణికంగా ప్రవేశాలు, స్కాలర్‌షిప్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సూర్యదేవర బదరిప్రసాద్, జాయింట్ సెక్రటరీ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.