ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:59 PM
వైద్యకళాశాలలపై లేనిపోని రాద్దాంతం చేస్తూ ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మండిపడ్డారు.
లక్కవరపుకోట, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): వైద్యకళాశాలలపై లేనిపోని రాద్దాంతం చేస్తూ ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మండిపడ్డారు.బుధవారం ఎల్.కోటలోని క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలో వివిధ అనారోగ్యకారణాల వల్ల కార్పొరేట్‌స్థాయి వైద్యం అందుకోలేని ఐదు నిరు పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిఽధి కింద రూ.15 లక్షల 35 వేలకు సంబం ధించిన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో కేబీఏ రాంప్రసాద్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.వరలక్ష్మి, కరెడ్ల ఈశ్వరరావు, వర్రి రమణ పాల్గొన్నారు. కాగా ఎల్.కోట పీహెచ్‌సీకి ఐడీబీఐ బ్యాంకు పెందుర్తి బ్రాంచ్ వారు మూడు లక్షల విలువగల వైద్య సామగ్రిని బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో అందజేశారు.లలితకుమా రి, గోల్డ్‌స్టార్ యాజమాన్యం సిఫారసుల మేరకు సీఎస్‌ఆర్ నుంచి సామగ్రిని వితరణ చేసినట్లు బ్రాంచి మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన రిఫ్రిజిలేటర్, ఏసీ, వాటర్‌ప్యూరింగ్ మిషన్, ఇన్వర్టర్, బ్యాటరీలు, బీపీ మిషన్, ల్యాబ్ పరికరాలు, వీల్‌చైర్, కంప్యూటర్, ఎలక్ర్టికల్ స్టౌ అందించారు.