Share News

టీడీపీలో వైసీపీ కౌన్సిలర్ల చేరిక

ABN , Publish Date - May 18 , 2025 | 12:11 AM

వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు వారి అనుచ రులు 50 మందితో కలిసి టీడీపీ లో చేరారు.

టీడీపీలో వైసీపీ కౌన్సిలర్ల చేరిక

బొబ్బిలి/రూరల్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు వారి అనుచ రులు 50 మందితో కలిసి టీడీపీ లో చేరారు. శనివారం వారంతా బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనా యన, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌వీఎస్‌కే రంగారావు, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో 14వ వార్డు కౌన్సిలర్‌ శీర శ్రీలక్ష్మి, 22వ వార్డు కౌన్సిలర్‌ తెంటు పార్వతి, 23వ వార్డు కౌన్సిలర్‌ కొర్లాపు రామారావు, 26వ వార్డు కౌన్సిలర్‌ మరిపి తిరుపతిరావు, ఏడో వార్డు కౌన్సిలర్‌ దిబ్బ సునీత, గోపి దంపతులు ఉన్నారు. వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 18 , 2025 | 12:11 AM