Share News

అశాంతి రేకెత్తించేందుకు వైసీపీ కుట్ర

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:36 AM

అశాంతిని రేకెత్తించే విధం గా వైసీపీ కుట్రలకు తెరలేపుతోందని రాజాంఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ఆరోపిం చారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలంలోని దేవళంపేటలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వైసీపీ నాయకులు నిప్పు పెట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టిం చేందుకు కుట్రలు చేశారని పేర్కొన్నారు.

 అశాంతి రేకెత్తించేందుకు వైసీపీ కుట్ర
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న మురళీమోహన్‌, అదితిగజపతిరాజు :

రాజాం/విజయనగరం రూరల్‌,అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): అశాంతిని రేకెత్తించే విధం గా వైసీపీ కుట్రలకు తెరలేపుతోందని రాజాంఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ఆరోపిం చారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలంలోని దేవళంపేటలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వైసీపీ నాయకులు నిప్పు పెట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టిం చేందుకు కుట్రలు చేశారని పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం విజయనగ రంలోని బాలాజీ కూడలి వద్ద ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, కూటమి నేతలు దళిత నాయకులతో కలిసి మురళీమోహన్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పైలమాలవేసి నివాళు లర్పించారు, టీడీపీ ఎస్సీసెల్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎస్‌సీ సెల్‌ నాయకులు మామిడి రవిశంకర్‌, మైలిపిల్లి పైడిరాజు, రొంగలి పోతన్న పాల్గొన్నారు.

వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ: ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ విగ్రహంపై దాడితో వైసీపీ దళితులు వ్యతిరేక పార్టీ అని స్పష్టమైందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపిం చారు. పార్వతీపురంలో గురువారం అంబేడ్కర్‌ విగ్రహానికి పాలభిషేకం చేసిన అనం తరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో వైసీపీనాయకులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘట ననుఖండిస్తున్నామన్నారు. అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి ఆయన సిద్ధాంతాలపై దాడిగా దళితులంతా భావిస్తున్నారన్నారు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైసీపీ నాయ కులను క్షమించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు.

Updated Date - Oct 10 , 2025 | 12:36 AM