విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:05 AM
మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలో గల వైఎస్‌ఆర్ కాలనీ అనే మధుర గ్రామానికి చెందిన కర్లి జగదీష్(25) అనే యువకుడు విద్యుదా ఘాతానికి గురై మృతిచెందాడు.
గరివిడి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలో గల వైఎస్‌ఆర్ కాలనీ అనే మధుర గ్రామానికి చెందిన కర్లి జగదీష్(25) అనే యువకుడు విద్యుదా ఘాతానికి గురై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. జగదీష్.. గరివిడి, చీపురుపల్లి పట్టణాల మధ్యన పోలీసుస్టేషన్ సమీపం లో ప్రధాన రహదారిని ఆనుకుని బైకు వాటర్ సర్వీసింగ్ సెంట ర్ నడుపుతున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమ యంలో ఒక బైకు వాటరింగ్ చేయడానికి మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య భారతితోపాటు 2 సంవత్సరాల వయస్సుగల ఒక చిన్న పాప ఉంది.