తలమీద రాయి పడి యువకుడి మృతి
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:27 AM
ఎస్.కోట పట్టణంలో గురువారం విషాధ ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కోట రూరల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఎస్.కోట పట్టణంలో గురువారం విషాధ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన అమీన్‌ఖాన్(25) విశాఖ -అరకు రోడ్డు పక్కన ఒక చిన్న బట్టల దుకాణం ఏర్పాటుచేసుకుని, జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం 10-30 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి దుకాణం వెనుకకు వెళ్లాడు. అదే సమయంలో పక్కనే ఉన్న భవనంపై పనిచేస్తున్న కార్మికుడు కిందకు రాళ్లు వేశాడు. దీంతో ఒక రాయి అమీన్‌ఖాన్‌పై పడింది. తలపై తీవ్రంగా గాయం అయ్యింది. వెంటనే గుర్తించిన స్థానికులు స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందాడు. ఎస్.కోట పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.