పిడుగు పాటుకు యువకుడి మృతి
ABN , Publish Date - May 31 , 2025 | 12:14 AM
మండలంలోని కృష్ణరాయుడుపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పాటుకు గురై శిమ్మ శ్రీనివాసరావు(33) అనే యువకుడు మృతి చెందాడు.
వేపాడ, మే 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృష్ణరాయుడుపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పాటుకు గురై శిమ్మ శ్రీనివాసరావు(33) అనే యువకుడు మృతి చెందాడు. శ్రీనివాసరావు గ్రామ సమీపంలోని చెరువు వద్ద పశువులను మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు తల్లి కృష్ణమ్మ, ఇద్దరు సోదరిణులు ఉన్నారు. తల్లి కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ తెలిపారు.