Share News

వ్యాను ఢీకొని యువకుడి మృతి

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:24 AM

బొండపల్లి గ్రామంలో పెట్రోల్‌ బంకు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

 వ్యాను ఢీకొని యువకుడి మృతి

  • ఇద్దరికి గాయాలు

బొండపల్లి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): బొండపల్లి గ్రామంలో పెట్రోల్‌ బంకు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్కువ మండలం వెంకటబైరిపురం గ్రామానికి చెందిన దాసరి సాయి(20), ఆకుల రాజేష్‌, నడిపల్లి రఘు అనే ముగ్గురు యువకులు విజయనగరం నుంచి తమ గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ సాయి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ యు.మహేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 05 , 2025 | 12:24 AM