సరైన ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:17 AM
కొత్తూరు గ్రామానికి చెందిన గోకేడ ప్రదీప్(25) తనకు సరైన ఉద్యోగం రాలేదన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎస్.కోట రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కొత్తూరు గ్రామానికి చెందిన గోకేడ ప్రదీప్(25) తనకు సరైన ఉద్యోగం రాలేదన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విష యంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామా నికి చెందిన బాపునాయుడు కుమారుడు ప్రదీప్ హైదరాబాద్ లోని ఒక నెట్‌వర్క్ సంస్థలో పనిచేస్తున్నాడు. అయితే ఇది తనకు తగిన ఉద్యోగం కాదని నిత్యం వాపోయేవాడు. రెండు రోజుల కిందట గ్రామానికి వచ్చిన ప్రదీప్ మనోవేదనతో ఉన్నాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.