గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:18 AM
విక్రంపురం సమీపంలోని మామిడి తోటలో పార్వతీపురం మండలం కోటవానివలస గ్రామానికి చెందిన కొచ్చెర్ల సుధీర్‌కుమార్(30) గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
కొమరాడ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): విక్రంపురం సమీపంలోని మామిడి తోటలో పార్వతీపురం మండలం కోటవానివలస గ్రామానికి చెందిన కొచ్చెర్ల సుధీర్‌కుమార్(30) గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మందు తాగిన వెంటనే భార్యకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని, అతన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుధీర్‌కుమార్ మృతిచెందాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో సుధీర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు.