పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:30 PM
వెంకటాపురం సమీపంలో వి.రాము(33) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నాడు.
సీతానగరం, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): వెంకటాపురం సమీపంలో వి.రాము(33) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మండలం శివడవలస గ్రామానికి చెందిన రాము.. సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ధనలక్ష్మిని కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. అయితే వారి మధ్య ఈ మధ్యకాలంలో గొడవ జరుగుతుండేవి. దీంతో మనస్తాపానికి గురైన రాము ఆదివారం మధ్యాహ్న సమయంలో పురుగు మందు తాగాడు. విషయం గమనించిన స్థానికులు పార్వతీపురంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాము చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్ము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేశారు.