పొగిరిలో యువకుల హల్‌చల్
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:15 AM
డబ్బులు బాకీ ఉన్నందుకు ఓ యువకుడిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిపై కత్తి, కొడవలితో దాడిచేసి గాయపరిచారు.
ఒకరిపై కత్తి, కొడవలితో దాడి
రాజాం రూరల్, అక్టోబరు 4(ఆంరఽధజ్యోతి): డబ్బులు బాకీ ఉన్నందుకు ఓ యువకుడిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిపై కత్తి, కొడవలితో దాడిచేసి గాయపరిచారు. ఈ ఘటనపై రాజాం ఎస్‌ఐ రవికిరణ్ శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన రౌతు రాంబాబు, పొగిరి ఉపేంద్ర, బొంగు సాయి ఈనెల 3న రాత్రి పొగిరి-జి.సిగడాం మధ్య మద్యం తాగుతున్నారు. ఇదే సమయంలో తనకు లోకేశ్ రూ.3వేలు ఇవ్వాలని సాయి.. రాంబాబు, ఉపేంద్రకు తెలిపాడు. అక్కడి నుంచే లోకేశ్ కు ఫోన్ చేశాడు. వీరు ముగ్గురున్న చోటుకు లోకేశ్ వెళ్లగా.. బాకీ చెల్లించా లని ఆ ముగ్గురు డిమాండ్ చేశారు. దీంతో లోకేశ్ తన వద్ద ఉన్న రూ.2వే లు సాయికి చెల్లించి, మిగిలిన మొత్తం చెల్లిస్తానని చెప్పి పొగిరి గ్రామం లోకి వెళ్లిపోయాడు. ఇదిలాఉంటే రాంబాబు, ఉపేంద్ర, సాయి గ్రామంలోకి వచ్చి మరోమారు లోకేశ్‌ను కొట్టే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న లోకేశ్ మిత్రుడు జడ్డు మాధవనాయుడు వివాదాన్ని నివా రించేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే కత్తి, కొడవలితో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉపేంద్ర, రాంబాబు.. మధ్యలో దూరిన మాధవ నాయుడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో మాధవనాయుడు తీవ్రంగా గాయ పడ్డాడు. ఇతనిని రాజాం సామాజిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంత రం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మాధవనాయుడు ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మాధవనాయుడు ఫిర్యాదు మేరకు రాంబాబు, ఉపేంద్ర, సాయిపై రాజాం ఎస్‌ఐ రవికిరణ్ కేసు నమోదు చేశారు.