Share News

బస్సు కింద పడి యువతి మృతి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:13 AM

చీపురుపల్లి నుంచి రాజాం వెళ్లే రోడ్డులో బస్సు కింద పడి పొందూరు ఆదిలక్ష్మి(25) ప్రాణాలు కోల్పోయింది.

బస్సు కింద పడి యువతి మృతి

చీపురుపల్లి, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి నుంచి రాజాం వెళ్లే రోడ్డులో బస్సు కింద పడి పొందూరు ఆదిలక్ష్మి(25) ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చీపురుపల్లి కూరాకుల వీధికి చెందిన ఆదిలక్ష్మి, రాజాంకు చెందిన బల్ల జగదీష్‌, ఆర్‌.ఠాకూర్‌ కలిసి చీపురుపల్లి నుంచి రాజాంకు స్కూటీపై మంగళవారం వెళ్తున్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో ఆర్‌టీసీ బస్సును వీరు ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. ప్రమాదంలో ఆదిలక్ష్మీ బస్సు కింద పడిపోయింది. తీవ్రగా యాలతో అక్కడికక్కడే మృతిచెందింది. జగదీష్‌కు గాయాలయ్యాయి. ఆదిలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ శంకరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:13 AM