సహజీవనంలో విభేదాలతో యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:47 PM
ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌బీ కాలనీ సింహాద్రిపురంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
విశాఖలో ఘటన
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం), అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌బీ కాలనీ సింహాద్రిపురంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సహజీవనంలో విభేదాల కారణంగా ఆమె ఉరేసుకుని మృతిచెందినట్లు తండ్రి పూడి వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఖాదర్ బాషా తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి ప్రాంతానికి చెందిన పూడి లిఖిత(20) ఇంటర్మీడియట్ పూర్తిచేసి, నర్సింగ్ కోర్సు చేయడానికి విశాఖకు ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చింది. ఆమె పెదచామలాపల్లి ప్రాంతానికి చెందిన రాయి నాగరాజుతో సింహాద్రిపురంలో సహజీవనం చేస్తోంది. నర్సింగ్ కోర్సు కూడా మానేసింది. సహజీవనంలో తరచూ వీరిద్దరూ గొడవపడేవారు. ఈనెల 10న నాగరాజు లిఖితతో గొడవపడి, బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన లిఖిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం శనివారం బయటపడటంతో యువతి తండ్రి వెంకటరమణ ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సహజీవనం చేసిన రాయి నాగరాజు ప్రోద్బలం వల్లనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.