Share News

యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:56 PM

పెదభోగిలి గ్రామ సచివాలయంలో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న చింతాడ సంధ్య(25) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది.

యువతి ఆత్మహత్య

సీతానగరం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెదభోగిలి గ్రామ సచివాలయంలో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న చింతాడ సంధ్య(25) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఈ ఘటనకు సంబంఽధించి ఎస్‌ఐ రాజేశ్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదంకలాం గ్రామానికి చెందిన సంధ్యకు పెళ్లి చేసేందుకు తల్లి సంబంధాలు చూస్తుంటే.. ఆమె నిరాకరించింది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెబుతూ ఈనెల 7న సీతానగరం రైల్వేస్టేషన్‌ సమీపంలో పురుగు మందు తాగింది. అప్పటి నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సంధ్య చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. తల్లి మీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 11 , 2025 | 11:56 PM