Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:37 AM

మండలంలోని శిష్టు సీతారాంపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రామభద్రపురం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని శిష్టు సీతారాంపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతిచెందాడు. కొద్దిక్షణాల్లో స్వగ్రామానికి చేరుకుంటాడన్న సమయంలో మృత్యువు కబలించింది. పోలీ సుల కథనం మేరకు.. శిష్టు సీతారాంపురం గ్రామానికి చెందిన వెన్నెల అప్పారావు ఉరఫ్‌ మధు(32) బైకుపై రామభద్రపురం నుంచి శిష్టు సీతారాంపురం వెళ్తున్నాడు. ఓ మలుపు వద్ద విద్యుత్‌ స్తంభానికి ఢీకొని అక్కడికక్కడే మృతిచెం దాడు. అప్పారావుకు గత నెల ఐదో తేదీన ప్రశాంతికుమారితో వివాహమైంది. పెళ్లి అయి 50 రోజులు కాకముందే అప్పారావు మృతితో భార్య రోదిస్తోంది. ఆయన కూలి పనులు చేసి జీవనం సాగిస్తున్నాడు. తండ్రి మృతిచెందడంతో తల్లి, భార్యకు అప్పారావు ఒక్కడే ఆధారం. భర్త మృతిచెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని భార్య విలపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించి ఎస్‌ఐ వి.ప్రసాదరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 19 , 2025 | 12:37 AM