Accident: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:14 AM
రోడ్డు ప్రమా దంలో ఓ యువకుడు మృతి చెందాడు.
కొత్తవలస, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమా దంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈఘటనపై కొత్తవలస సీఐ సీహెచ్ షణ్ముఖరావు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస పంచాయతీ చీపురువలస గ్రామానికి చెందిన రంధి వేణు(22) సోమవారం తన స్కూటీపై అదే గ్రామానికి చెందిన మేడపురెడ్డి హేమంత్‌కుమార్‌ను వెనుక ఎక్కించుకుని తమ గ్రామం నుంచి వీరభద్రపురం గ్రామానికి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వెళ్తున్నాడు. వర్షంలో స్కూటీ అదుపు తప్పడంతో ఇనుప రైలింగ్‌ను ఢీకొన్నారు. రైలింగ్ రేకు వేణు మెడలో దిగిపోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న హేమంత్‌కుమార్‌కు తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విశాఖపట్టణం తరలించారు. వేణు బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగన్వేషణలో ఉన్నాడు. మృతుడికి తండ్రి వెంకటరమణ, తల్లి గోవిందమ్మతో పాటు చెల్లి హిమబిందు ఉన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.