ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి దుర్మరణం
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:06 AM
పెరుమాళిలో ట్రాక్టర్ బోల్తా పడి పోడ్ల రాము(23) దుర్మరణం చెందాడు. చెరువు వద్ద ట్రాక్టర్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదం సంభవించింది.
తెర్లాం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పెరుమాళిలో ట్రాక్టర్ బోల్తా పడి పోడ్ల రాము(23) దుర్మరణం చెందాడు. చెరువు వద్ద ట్రాక్టర్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ ను కడిగేందుకు గ్రామ సమీపంలోని చెరువులో రాము దింపాడు. రాముతో పాటు మరికొంతమంది యువకులు ట్రాక్టర్‌ను కడిగేందుకు సాయం చేశారు. చెరువు గట్టుపైకి ట్రాక్టర్‌ను రాము తీసుకు వస్తుండగా మట్టిలో టైర్లు కూరుకు పోయాయి. ట్రాక్టర్ ఒక్కసారిగా పైకి లేవడంతో రాము పక్కకు గెంతేశాడు. దాంతో ఆ ట్రాక్టర్ రాముపై బోల్తా పడింది. కొనఊపిరితో ఉన్న రామును రా జాంలోని ఓ ఆసుపత్రికి తరలించే సరికి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.