రైలు ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:49 PM
కుమ్మరిగుంట గ్రామానికి చెందిన యలగల పరిశినాయుడు (25) ఆదివారం రైలు ఢీకొని దుర్మరణం చెందాడు.
కొమరాడ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): కుమ్మరిగుంట గ్రామానికి చెందిన యలగల పరిశినాయుడు (25) ఆదివారం రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. మార్కొండపుట్టి గ్రామానికి మిత్రులను కలవడానికి వెళుతుండగా విక్రంపురం సమీపంలో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరైంది. జీఆర్‌పి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా మృతుడు సోదరుడు 2007లో ఓ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందాడు. 2014లో అనారోగ్యంతో తండ్రి మృతి చెందారు. పరిశినాయుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లిని పోషిస్తున్నాడు. ఇంతలో కొడుకు రైలు ఢీకొని మృతి చెందడంతో తల్లి రోదనతో స్థానికులు కంటతడి పెట్టారు.