రైలు ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:20 AM
మండలంలోని గున్నతోటవలస రైల్వే లైన్ వద్ద శనివారం ఉదయం గుర్తు తెలియని రైలు ఢీకొని కృష్ణాపురం గ్రామానికి చెందిన బలగ మధు (23) మృతి చెందాడు.
బొబ్బిలి రూరల్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని గున్నతోటవలస రైల్వే లైన్ వద్ద శనివారం ఉదయం గుర్తు తెలియని రైలు ఢీకొని కృష్ణాపురం గ్రామానికి చెందిన బలగ మధు (23) మృతి చెందాడు.ఈ మేరకు ప్రభుత్వ రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి. ఈశ్వరరావు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బలగ మధు ట్రిబుల్ ఐటీ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మధుకు తండ్రి శంకరరావు, తల్లి అప్పలనరస మ్మ, తమ్ముడు రవి ఉన్నారు. మధు కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు అప్పగించారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు విలేకరులకు తెలిపారు.