రైలు ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:17 AM
గిట్టుపల్లి రైల్వే గేటు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు.
బొండపల్లి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గిట్టుపల్లి రైల్వే గేటు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. బొబ్బిలి రైల్వే హెచ్‌సీ బండారు ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం వింద్యవాసి గ్రామానికి చెందిన టొంపల శంకర్ (28) రైల్వే ట్రాక్ దాటుతుండగా.. విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళుతున్న గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి తండ్రి పరశురాం, తల్లి నాగమణి, సోదరుడు హరి ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న కుమారుడు అర్థాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.