మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:13 AM
వెంకటాపురానికి చెందిన ఎస్.సతీష్(25) అనే యువకుడు పురుగు మందు తాగి మంగళవారం ఆత్మహ త్య చేసుకున్నాడు.
సీతానగరం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వెంకటాపురానికి చెందిన ఎస్.సతీష్(25) అనే యువకుడు పురుగు మందు తాగి మంగళవారం ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సతీష్ గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో సతీష్ మనస్తాపానికి గురై శనివారం రాత్రి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీష్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సతీష్ ఆర్టీసీలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడి తండ్రి శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేశారు.