Share News

నాణ్యమైన జీడిపప్పు కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:13 AM

నుంచి నాణ్యమైన జీడిపప్పు కొనుగోలు చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

నాణ్యమైన జీడిపప్పు కొనుగోలు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): నుంచి నాణ్యమైన జీడిపప్పు కొనుగోలు చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 300 మెట్రిక్‌ టన్నుల జీడిపప్పు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. స్వయంగా జీడి పరిశ్రమలను ఏర్పాటు చేసు కుని క్రయ, విక్రయాల జరుపుకునేందుకు వీడీవీకేల సభ్యుల తీర్మానం తప్పనిసరన్నా రు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో సబ్‌ కలెక్టర్లు, ఏపీఎంలు, ఉద్యానవ శాఖాధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యాపా రుల కన్నా ముందే నాణ్యమైన జీడిపప్పును రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. పప్పును ప్రాసెసింగ్‌ చేసి విక్రయాలు జరిపేవరకు అవసరమయ్యే గన్నీ బ్యాగ్‌లు, స్టోరేజ్‌ పాయింట్లను సిద్ధం చేయాలన్నారు. అలాగే జీడి పరిశ్రమలకు అవసరమైన యంత్ర సామగ్రి, ప్రాసెసింగ్‌, క్రయవిక్రయా లు, ప్యాకింగ్‌, రవాణా, మార్కెటింగ్‌ సదుపా యాలపై సభ్యులకు శిక్షణ ఇవ్వాలని ఆదే శించారు. ఏప్రిల్‌ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలన్నారు. క్రయ విక్రయాల రికార్డులు పక్కాగా నిర్వహించేందుకు ఇద్దరు వీడీవీకే సభ్యులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో పార్వతీపురం, పాల కొండ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు అశు తోష్‌ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, వెలుగు ప్రాజెక్టు అధికారి వై.సత్యం నాయుడు, ఏపీఎంలు, ఉద్యానవన శాఖాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:13 AM