Yoga Street in Vizianagaram విజయనగరంలో యోగా స్ట్రీట్
ABN , Publish Date - May 27 , 2025 | 12:09 AM
Yoga Street in Vizianagaram ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యానికి రాచబాట వేయవచ్చునని, శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చునని నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్ నిర్వహించారు. పైడిమాంబ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛందంగా హాజరయ్యారు.
విజయనగరంలో యోగా స్ట్రీట్
యోగాతో ఆరోగ్యం: కమిషనర్
విజయనగరం/రింగురోడ్డు, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యానికి రాచబాట వేయవచ్చునని, శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చునని నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్ నిర్వహించారు. పైడిమాంబ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛందంగా హాజరయ్యారు. అనంతరం కోట వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ, భారతీయ సాంస్కృతిలో ఓ సంప్రదాయంగా వస్తున్న వ్యవస్థల్లో యోగా ఒకటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగా ఆవశ్యకతను పరిపూర్ణంగా తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టరు జీవనరాణి, ఆయుష్ అధికారి డాక్టరు ఆనందరావు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ఈఈ టి.రాయల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.