Yoga should be frequented యోగాకు అధికంగా తరలిరావాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:59 PM
Yoga should be frequented యోగా దినోత్సవానికి జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత నిర్దేశించారు.

యోగాకు అధికంగా తరలిరావాలి
ఎమ్మెల్యేలు, నాయకులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత
విజయనగరం రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): యోగా దినోత్సవానికి జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత నిర్దేశించారు. విజయనగరానికి ఆదివారం వచ్చిన ఆమె పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత నెల 21 నుంచి అన్ని జిల్లాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, యోగా వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. యోగా కార్యక్రమంలో సచివాలయం స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంఘ సభ్యులు, విద్యార్థులు, క్రీడాకారులు, వాకర్స్, యోగాశిక్షకులు ఇలా అన్ని వర్గాల వారు భాగస్వాముల య్యారన్నారు. ఈ నెల 21న విశాఖలో జరగనున్న కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ సమష్టి కృషి చేయాలని చెప్పారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ నెల 21న ఎక్కువ మంది యోగా చేయడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సుగా పరిగణించబడుతుందని అన్నారు. ఇందుకు జిల్లాలో ముఖ్యంగా జిల్లా కేంద్రమైన విజయనగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ, యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కొండపల్లి కొండలరావు, కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, పి.రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.