Share News

Yoga Andhra ప్రదేశాల్లో యోగాంధ్ర

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:22 AM

Yoga Andhra at 3,800 Locations జిల్లాలోని 3,800 ప్రదేశాల్లో శనివారం పెద్దఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యోగాంధ్ర కార్య క్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పెద్దఎత్తున పేర్లు నమోదు చేసుకోవడం శుభపరిణామమన్నారు.

Yoga Andhra   ప్రదేశాల్లో యోగాంధ్ర
మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 3,800 ప్రదేశాల్లో శనివారం పెద్దఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యోగాంధ్ర కార్య క్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పెద్దఎత్తున పేర్లు నమోదు చేసుకోవడం శుభపరిణామమన్నారు. భారీగా చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు, ఇతర అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, అన్ని శాఖల సిబ్బంది పాల్గొనేలా చూడాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధడుతున్న వారు, గర్భిణులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నద్ధం కావాలని ఆదేశించారు.

రేపటి నుంచి డీఏ జుగా గ్రామసభలు...

ధర్తి అబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్‌ కింద జూన్‌ 15 నుంచి 30వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు షెడ్యూల్‌ తయారు చేసి ఆయా గ్రామాలకు ముందుగానే సమాచారం అందించాలన్నారు. ఇప్పటికే సర్వేల ద్వారా ప్రజల అవసరాలకు గుర్తించామని వెల్లడించారు. సీఎం సూర్యఘర్‌ లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు ఇంకా విస్తృతం చేయాలన్నారు. సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామసభలకు సంబంధించి విధి విధానాలను రూపొందించామన్నారు. ప్రతి గిరిజనుడికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:22 AM