Share News

వైసీపీ చేష్టలను ఉపేక్షించేది లేదు

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:11 AM

అధికారంలో ఉన్నంత కాలం దౌర్జన్యాలకు, రౌడీయిజానికి పాల్పడిన వైసీపీ నాయకులు, ఇప్పుడు కూడా తమదే రాజ్యం అన్నట్టు వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు.

వైసీపీ చేష్టలను ఉపేక్షించేది లేదు

చీపురుపల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నంత కాలం దౌర్జన్యాలకు, రౌడీయిజానికి పాల్పడిన వైసీపీ నాయకులు, ఇప్పుడు కూడా తమదే రాజ్యం అన్నట్టు వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి కార్యాలయంలో దళిత యవకుడిపై దాడి చేయడం దారుణమన్నారు. గత ఐదేళ్లూ రాష్ట్రంలో గూండాల పాలన సాగిందని, ఇకపై అటువంటి అరాచకాలకు రాష్ట్రంలో తావులేదన్నారు. దళిత యువకుణ్ణి హింసించి, వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం ద్వారా వైసీపీ నాయకులు పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తు న్నారని విమర్శిం చారు. గతంలో దళితులపై దాడులు చేయడం, వ్యతిరేకంగా మాట్లాడిన వారిని క్రూరంగా హత మార్చడాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నాగార్జున స్పష్టం చేశారు.

Updated Date - Aug 09 , 2025 | 12:11 AM