వైసీపీ అసత్య ప్రచారం మానుకోవాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:59 PM
కాశీబుగ్గ ఘటనపై వైసీపీ అసత్యప్రచారం మానుకోవాలని మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కర్రోతు బంగార్రాజు కోరారు.
పూసపాటిరేగ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ ఘటనపై వైసీపీ అసత్యప్రచారం మానుకోవాలని మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కర్రోతు బంగార్రాజు కోరారు. ఆదివారం భోగాపురం మండలంలోని పోలిపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ కాశీబుగ్గలోని వేంకటేశ్వరాలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలుకోల్పోవడం బాధాకరమనితెలిపారు.ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతోపాటు క్యూలైన్లతను క్రమబద్దీకరించి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు రాజకీయాలు చేయడం సబబుకాదన్నారు. సమావేశంలో భోగాపురం మండలపార్టీ అద్యక్షులు కర్రోతు సత్యన్నారాయణ, నాయకులు సువ్వాడ రవిశేఖర్, కంది చంద్రశేఖర్, పతివాడ అప్పలనారాయణ, ఆకిరి ప్రసాదరావు, మహంతి శంకరరావు, రాజారావు పాల్గొన్నారు.