Share News

జేసీగా యశ్వంత్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:41 PM

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి గురువారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

జేసీగా యశ్వంత్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు
జేసీగా బాధ్యతలు స్వీకరించిన యశ్వంత్‌కుమార్‌రెడ్డి

పార్వతీపురం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి గురువారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు డీఆర్వో కె.హేమలత తదితరులు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్‌ నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడలకు సంబంధించిన కరపత్రాలను డీఆర్వో, రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.శ్రీరామ్మూర్తి, ఇతర అధికారులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, ఐటీడీఏ ఏపీవో ఎ.మురళీధర్‌, తహసీల్దార్‌ సురేష్‌, కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి చిన్నారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా కూడా..

పార్వతీపురం ఐడీడీఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారిగా జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఇన్‌చార్జి పీవోగా సబ్‌ కలెక్టర్‌ వైశాలి విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా జాయింట్‌ కలెక్టర్‌ బాధ్యతతో పాటు ఇన్‌చార్జి పీవో బాధ్యతను కూడా యశ్వంత్‌కుమార్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఆయనకు ఐటీడీఏ ఏపీవో మురళీధర్‌, ఏఏవో ప్రసాద్‌, పలువురు గిరిజన సంఘాల నాయకులు స్వాగతం పలికారు.

Updated Date - Sep 11 , 2025 | 11:41 PM