మత్స్యకారుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:50 PM
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి తెలిపారు. ఆదివారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంపు కార్యాలయంలో విలే కరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి తెలిపారు. ఆదివారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంపు కార్యాలయంలో విలే కరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ప్రభుత్వ సాయాన్ని రూ.10 వేలు నుంచి రూ.20 వేలుకు పెంచినట్లు తెలిపారు. గతంలో వృద్ధులకు పింఛన్ రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పెంచినట్లు చెప్పారు. సమావేశంలో పాడి సుధ, పోలూ రి శ్రీనివాస్, తులాల రవి, శొంఠ్యాన రమేష్ పాల్గొన్నారు.