కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:46 PM
జూట్ మిల్లు యాజమాన్యం కార్మిక శాఖ అధికారుల వద్ద చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కిల్లంపల్లి రామారావు డిమాండ్‌చేశారు.
నెల్లిమర్ల, జూన్ 21(ఆంధ్రజ్యోతి): జూట్ మిల్లు యాజమాన్యం కార్మిక శాఖ అధికారుల వద్ద చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కిల్లంపల్లి రామారావు డిమాండ్‌చేశారు. శనివారం స్థానిక జూట్‌మిల్లుగేట్ వద్ద గేట్‌మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లు తెరిచే క్రమంలో ఫిబ్రవరిలో కార్మికశాఖ అధికారులు వద్ద చేసు కున్న అగ్రిమెంట్‌మేరకు మిల్లు తిరిగి నాలుగు నెలలు కావస్తున్నా యాజ మాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. మృతి చెందిన ఇద్దరి కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం వసూలుచేసిన డెత్‌ఫండ్ ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. పీఎఫ్,ఈఎస్‌ఐ బకాలు కూడా చెల్లించాలన్నారు. 2016 నుంచి రిటైర్డ్ కార్మికులకు గ్రా ట్యూటీ బకాయిలు చెల్లిస్తానని చెప్పి యాజమాన్యం చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం అగ్రిమెంట్‌ప్రకారం సమస్యలను వెంటనే పరి ష్కరించాలని డిమాండ్‌చేశారు.