Dedication అంకితభావంతో పనిచేయాలి
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:57 PM
Work with Dedication ఏ ప్రాంతంలోనైనా అంకిత భావంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
పార్వతీపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఏ ప్రాంతంలోనైనా అంకిత భావంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. శుక్రవారం స్థానిక డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో ఏఎన్‌ఎంలకు బదిలీల ఆదేశ పత్రాలను అందించారు. ఈనెల 10న పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహించడం వల్ల ఆదేశాల ప్రతాలను ఇవ్వలేకపోయామన్నారు. ఇతర జిల్లాలకు స్థానచలనం పొందిన వారి స్థానంలో కొత్తవారు చేరిన తర్వాత రిలీవ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా జిల్లాకు కొత్త వైద్యులు వస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే కొంతమంది వచ్చి విధుల్లో చేరినట్టు చెప్పారు. అంతకముందు ప్రపంచ జనాభా దినం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు వినోద్, జగన్, రఘు, తదితరులు పాల్గొన్నారు.