అంకితభావంతో పనిచేయండి
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:21 AM
నూతనంగా ఎంపికైన అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం నియామక పత్రాలను పంపిణీ చేశారు.
పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర
పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): నూతనంగా ఎంపికైన అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వైకేఎం కాలనీలో ఉన్న టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ఆయన నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రౌతు వేణుగోపాల్‌నాయుడు, బోనుదేవి చంద్రమౌళి, 8వ వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి పంపిణీ
పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం 17వ వార్డుకు చెందిన కె.శ్రీనివాసరావుకు, అడ్డాపుశీల గ్రామానికి చెందిన చీపురుపల్లి ప్రదీప్‌లకు మంజూరైన చెక్కులను ఆయా కుటుంబ సభ్యులకు ఆయన అందించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.